ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టి దాదాపు నెలన్నర కావస్తోంది. అయితే ఈ 45 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని తెలుగుదేశం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబే సీఎం అవుతాడట.


ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంటున్నారు. జగన్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని.. అందుకే వ్యతిరేకత పెరిగిందని ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ రోజు ఎన్నికలు వస్తే మళ్ళీ చంద్రబాబు సీఎం కావడం ఖాయం అని అంటున్నారు.


అంతే కాదు.. త్వరలో రానున్న జమిలి ఎన్నికలు ఎగిరిపడుతున్న అందరికీ సమాధానం చెబుతాయని ప్రత్తిపాటి పుల్లారావు అంచనా వేస్తున్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండిస్తున్నారు. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ గా వర్ణిస్తున్నారు.


తనకు బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనే లేదని మంత్రి ప్రత్తిపాటి అంటున్నారు. తానే కాదు.. ఎవరూ టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళరని ఆయన ధీమాగా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: