ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. గ్రామాల్లోని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేయాలని జగన్‌ భావిస్తున్నారు. ఆ మేరకు గ్రామ సచివాలయం వంటి కొత్త వ్యవస్థలు తీసుకొస్తున్నారు.


అంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ మార్పులు కొందరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు రేషన్ డీలర్లు.. గ్రామ వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రేషన్ డీలర్లు ఉండరు.. వారిని తొలగించేస్తారు.


మరి ఇన్నాళ్లూ దీనిపై ఆధారపడిన రేషన్ డీలర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై మాత్రం సర్కారు చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఇప్పడు ఈ అంశాన్ని తెలుగుదేశం అస్త్రంగా మలచుకోవాలని చూస్తోంది. రేషన్ డీలర్ వ్యవస్థను తొలగిస్తే.. పెద్ద ఎత్తున రేషన్ డీలర్స్ తో కలిసి ఆందోళన చేపడతామని చెబుతోంది.


ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు ముప్పై వేలమంది రేషన్ డీలర్లు రోడ్డున పడతారని తెలుగుదేశం చెబుతోంది. రేషన్ డీలర్ల కుటుంబాలు రోడ్డున పడకుండా చర్యలు చేపడితే మాకు అభ్యంతరం లేదని అంటోంది. అలా కాకుండా వారిని గాలికి వదిలేస్తే మాత్రం సహించమని చెబుతోంది. మరి దీనికి ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: