అబద్దం ఆడటం.. నిజం చెప్పకపోవడం .. చూడటానికి ఈ రెండూ ఒక్కలాగానే కనిపించినా ఇవి ఒకటి కాదు.. అబద్దం ఆడటం అంటే అబద్దమే.. కానీ నిజం చెప్పకపోవడం అబద్దం చెప్పడం కాదు.. అందుకే కొందరు రాజకీయ నేతలు ఈ రెండో రూటు ఎంచుకుంటారు..


ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నాడు. జగన్ తన తండ్రి వైఎస్ జయంతి రోజైన ఈరోజు నుంచి కొన్ని నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నాడు. అందులో వైఎస్సార్ పింఛన్ కానుక ఒకటి. దీని ద్వారా వృద్దులకు ఇక నుంచి నెలకు రూ. 2250 అందివ్వబోతున్నారు.


అంత వరకూ బాగానే ఉంది.. కానీ జగన్.. జమ్మలమడుగు సభలో ఏం చెబుతుతన్నారు.. 4 నెలల క్రితం వెయ్యి రూపాయలుగా ఉన్న ఫింఛన్ ను దాదాపు రెట్టింపు చేసి ఇప్పుడు 2250 ఇస్తున్నాను అని ఘనంగా చెబుతున్నాడు. ఇది అక్షరాలా నిజమే.


కానీ ఇక్కడ జగన్ దాస్తున్న నిజం ఇంకొకటి ఉంది. చంద్రబాబు సర్కారు తన చివరి మూడు నెలల్లో వెయ్యి రూపాయల పింఛనును రెట్టింపు చేసి 2000 ఇచ్చింది. ఇప్పుడు జగన్ వచ్చి పెంచింది 250 మాత్రమే. అయితే.. ఆ విషయం చెప్పకుండా జగన్ 4 నెలక్రితం నాటి ఫించన్ తో నేటి ఫించనను పోలుస్తున్నాడు.


వాస్తవానికి చంద్రబాబు సర్కారు కూడా జగన్ అప్పటికే ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టే ఎన్నికల ముందు ఓటమి భయంతో అప్పటికప్పుడు ఫించన్ రెట్టింపు చేసింది. అందుకే జగన్ ఆడుతున్న ఈ అబద్దాన్ని అందమైన అబద్దంగా వర్ణించాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: