ఇప్పుడు దేశం మొత్తం కర్ణాటక రాజకీయాల వైపే చూస్తుంది. వారం రోజులు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు అక్కడి రాజకీయాల్లో కలకం రేపాయి.  ఆ మద్య జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ ఉండటంతో యడ్యూరప్ప సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు.  కానీ అప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు కుదర్చుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

సీఎంగా కుమార స్వామి పదవిలోకి వచ్చారు.  ప్రసుతం కేంద్రంలో బీజేపీ పాలనలో ఉండతంతో ఆ ఎఫెక్ట్ కర్ణాటకపై పడిందనిపిస్తుంది.  సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ ఎమ్మేల్యేలు పక్కకు తప్పుకుంటే మెజార్టీ లెక్కలు దగ్గిపోతాయి.  తాజాగా బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.   ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు.

ఈ సమావేశానికి ముందు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ, శాసనసభాపక్ష సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్, కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, సీఎం కుమారస్వామి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రేపు కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: