సీఎం కావడం తన కల అని స్వయంగా ప్రకటించుకున్న జగన్.. ఆ కల సాకారానికి ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. మరోన్నో అవమానాలు అవరోధాలు ఎదురుకున్నారు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. ఈ విషయంలో జగన్ ను నిజంగా అభినందించాల్సిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. జగన్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది. ముఖ్యమంత్రి కూర్చీతోనే  బోలెడన్ని బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్న జగన్, ఇప్పుడు ఆ బాధ్యతలే  అధిక భారం అయి జగన్ని ముంచేలా కనిపిస్తున్నాయి.  


ఒకపక్క జగన్ ఇచ్చిన హామీలు అనేకం.. అమలు పరచాలంటే బడ్జెట్ సరిపోదు. మరోపక్క కేంద్రం నుంచి రావాల్సిన హోదా మరియు ఇతర అంశాలు ఏమాత్రం ముందుకు వెళ్లేలా కనిపించట్లేదు. బీజేపీ ఈ మధ్య జగన్ ను  టార్గెట్ గా పెట్టుకుంది.  పైగా హోదా  ఏపీకి ఇచ్చేది లేదని బీజేపీ తేల్చేసింది. దీనికి తోడు బడ్జెట్ విషయంలో కూడా ఏపీకి అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్ పై  వైసీపీ ఎంపీలు పెద్దగా మాట్లాడకపోవడం కూడా ఇప్పుడు జగన్ పార్టీకి చేటు చేసేలా ఉంది. మొత్తంగా చెప్పుకుంటే బీజేపీ నుండి జగన్ సాయం అందదు. జగన్ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే.. బడ్జెట్ అమాంతం పెరగాలి. అది సాధ్యమయ్యే పనికాదు.       


ఈ పరినిమాలన్ని గమనిస్తే..    ఏపీ సీఎంగా  జగన్ తీవ్రమైన ఒత్తిడిలోకి  వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ ఇచ్చిన ప్రతి హామీలో  ప్రతీ అంశంలో  విఫలం అవుతున్నారని ఇతర పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.  రాష్ట్రానికి హోదా రాకపోతే  ఇతర పార్టీల వారితో పాటు ప్రజలు కూడా జగన్ ను   ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.   అన్నిటికి మించి  రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ముందు పెను సవాళ్లు  ఉన్నాయి. ఆ సవాళ్ళను ఎలా అధిగమిస్తారు. ప్చ్ పాపం జగన్ అన్ని కష్టాలే.  


మరింత సమాచారం తెలుసుకోండి: