అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇటీవల 2019 లో జరిగిన ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన తాఆజా ఎమ్మెల్యే, మాజీ హోమ్‌ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాజీ కాబోతున్నట్టు మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్లలో లోపాలే ఆయన పాలిట శాపాలుగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


*నిమ్మకాయల రాజప్ప కథ:*
ఇక మన నిమ్మకాయల చినరాజప్ప ఇప్పుడే వచ్చిన రాజకీయ వేత్త కాదు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడు. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వంలో రెండు కీలకశాఖ బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోంమంత్రి - విపత్తు నివారణ శాఖా మాత్యులుగా కీలకంగా వ్యవహరించారు. ఇంత సుధీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు గత అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో పొరపాటున కాదు... 'ఎవరూ ఏం చేయలేరనే ఆత్మవిశ్వాసం. ధిక్కార ధోరణి'. వెరసి ఇప్పుడు పదవికి ఎసరు వచ్చింది.


*అసలేం జరిగింది:*
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారు. అఫిడవిట్‌ ఫారం–26లో 5వ కాలమ్‌ లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్‌ కేసులున్నాయా..? లేవా..? అనే కాలమ్‌ లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అయితే ఓబుళాపురం మైనింగ్‌ వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్‌ కార్యాలయానికి వెళ్ళారు.

అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి, అక్కడి ఆస్తులు ద్వంసం చేశారని రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేశారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్‌ కూడా జారీచేసింది. తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. విజయవాడ న్యాయస్థానం కూడా 2018, డిసెంబర్‌ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చింది. ఈ కేసు గురించి అఫిడవిట్ లో ఎక్కడా ప్రస్థావించలేదు.


*ఇదిగో మరో తప్పు:*
2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్‌ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ ను మరో మోసం చేశారనే కోణం వెలుగుచూసింది



మరింత సమాచారం తెలుసుకోండి: