2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  175 స్ధానాలకి   23 స్ధానాలు ఇచ్చి  తెలుగుదేశం పార్టీకి అవమాన కరమైన ఓటమిని ఇచ్చారు ఏపీ ప్రజలు. నిజానికి ఇంత‌టి ఘోర  ప‌రాభావాన్ని టీడీపీ ఎప్పుడూ ఎదుర్కోలేదు.   పైగా మళ్ళీ  తెదేపా  అధికారంలోకి రావాలంటే అసాధ్యమే అంటున్నారు. అందుకే  పార్టీ నాయ‌కులు, పార్టీని న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి అలుపెరుగ‌ని సేవ‌లు చేసిన కార్య‌క‌ర్త‌లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అయితే మళ్లీ బాబు సీఎం అవ్వటానికి చాలా అవకాశాలే కనిపిస్తున్నాయి.   


బాబు ఓట‌మికి గల కార‌ణాల‌ను విశ్లేషించుకుని చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా వ్యతిరేకత తగ్గుతుంది.  అవ‌స‌ర‌మైతే ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌తో పాటు బ‌లాల‌ను కూడా తెలుసుకుని వాటిని కూడా అవ‌స‌రం మేర‌కు అమ‌లు చేసే విధంగా ముందుకు సాగాలి. అలాగే  నాయ‌క‌త్వ లోపం లేకుండా రాకుండా.. ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టాలి.  ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ ఇలా ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు. అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా..  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయ‌గ‌ల‌గాలి. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉండాలి.  గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌కు, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌కు తేడా అంశాల‌ను నోట్ చేస్తూ అప్పుడ‌ప్పుడూ నాయ‌కుల‌తో అధినేత స‌మీక్ష‌లు జరపాలి.  


అదే విధంగా  ఆలోచ‌న‌లు పంచుకునేందుకు అంద‌రికీ అవ‌కాశం ఇవ్వాలి.  ముఖ్యంగా పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో పార్టీని వీడ‌కుండా బుజ్జగింపులు చేపట్టాలి. ప్రధానంగా యువ నాయ‌క‌త్వానికి పెద్ద పీఠ వేయాలి.  ఇలా సందర్భానుసారంగా  మేటి ప్ర‌ణాళిక‌లు వేస్తూ  ముందుకు వెళ్ళితే..  మళ్లీ  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ్వడం సాధ్యమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: