జగన్ వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పటి తరం రాజకీయాలకు అసలు కుదరనిది. అంతా తాను అనుకున్నట్లుగానే జరగాలనుకుంటారు. ఒక ఇంచి అటు నుంచి ఇటు అయినా కూడా జగన్ అసలు సహించారు. ఆ విషయంలో ఆయన ఎంత పెద్ద వారినైనా ఎదిరిస్తారు.


ఇక విషయానికి వస్తే జగన్ తన మనసుకు తోచినట్లుగా ఏపీలో పాలనాపరంగా నిర్ణయం తీసుకుంటున్నారు. క్యాష్ లెస్ విధానాన్ని దేశంలో తీసుకురావాలని ఓ వైపు ప్రధాని మోడీ గట్టిగా క్రుషి చేస్తూంటే ఏపీలో జగన్ మాత్రం ఇంటికే నగదు అంటూ సరికొత్త పధకాన్ని ప్రారభిస్తున్నారు. ఇది నిజంగా మోడీ అనుకున్నదానికి భిన్నం, వ్యతిరేకం.


ఇకపై ఏపీలో ఏ ప్రభుత్వ పధకమైనా గ్రామ వాలంటీర్లు నేరుగా ఇంటికి తీసుకువచ్చి ఇస్తారని జగన్ చెప్పడం ఓ విధంగా క్యాష్ లెస్ విధానానికి తూట్లు పొడవడమేనని బీజేపీ నేతలు అంటున్నారు. దేశమంతా ఏదో ఒకనాటికి క్యాష్ లెస్ విధానం తేవాలన్నది మోడీ ప్లాన్ అయితే జగన్ నేరుగా డబ్బు పట్టుకుని లబ్దిదారుని ఇంటికే ఇస్తానని అంటున్నారు. 


ఇక్కడ పెద్దయనకు కోపం వచ్చే అవకాశం ఉంది. అయినా జగన్ మాట వినరు. అసలు ఎవరి మాటా కూడా అయన వినే విషయమే లేదు. నగదు నేరుగా పేదవారి ఇంటికి తీసుకుని వెళ్ళడం ద్వారా వారి ముఖంలో ఆనందం చూడాలన్న జగన్ సంకల్పం గొప్పది, ఓ విధంగా రాజకీయంగా ఆయనకు అనుకూలించేది. ఎందుకు ఆయన వదులుకుంటారు మరి. అవసరమైతే  మోడీకి ఈ విషయంలో జగన్ ఎదురు నిలుస్తారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: