చంద్రబాబు రాజకీయ జీవితంలో మిత్రులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ శత్రువులు చాలా మంది ఉన్నారు. వారితో చంద్రబాబు ఎన్నికల్లో చాలా సార్లు ఓడిపోయారు. వారు బాబు మీద అలా ఇలా కాకుండా పగ పట్టేసేవారు. దాంతో ఒంటిచేత్తో పోరాడినా కూడా బాబుకు ఓటమే ఎదురైంది.


ఇదిలా ఉండగా ఓట‌మి వేద‌న వెంటాడుతున్నా.. బాబు వ‌ర‌కూ వ‌స్తే ఒక మ‌చ్చ నుంచి ఆయ‌న దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉందంటున్నారు. బాబు ప‌వ‌ర్లో ఉంటే వాన‌లు ప‌డ‌వ‌ని విమ‌ర్శించే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు రానున్న రోజుల్లో ఆ మాట‌ను బాబును ఉద్దేశించి అన‌లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. ఏపీలో ఇప్పుడు ప‌వ‌ర్లోకి వ‌చ్చింది జ‌గ‌న్‌. ఆయ‌న ఎంట్రీ ఏమో కానీ.. జూన్ లో రావాల్సిన వ‌ర్షాలు ఇప్ప‌టివ‌రకూ ప‌త్తా లేవు.


జులై మొద‌టి వారం గ‌డిచినా.. వేస‌విలో ఎలాంటి ప‌రిస్థితి ఉందో ఏపీలో ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే ఉండ‌దు. బాబు వ‌స్తే చాలు వ‌రుణుడు ప‌త్తా ఉండ‌ర‌న్న సంగ‌తి తర్వాత‌.. జ‌గ‌న్ ప‌వ‌ర్లోకి వ‌చ్చాక వ‌రుణుడి అడ్ర‌స్ గ‌ల్లంతైంద‌న్న మాట వినిపిస్తోంది. బాబు ఓట‌మి వేద‌న‌ను ప‌క్క‌న ప‌డితే.. ఆయ‌న మీద ప‌డిన మ‌చ్చ మాత్రం తాజాగా తొలిగిపోయిన‌ట్లేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  మొత్తానికి బాబుకు జగన్ ఇద్దరూ తనకు శత్రువులేనని వరుణుడు సమాన దూరం పాటించారనుకోవాలి. ఇక వైసీపీ నేతలు ఈ విషయమో బాబుని ఏమీ అనలేరు కూడా.



మరింత సమాచారం తెలుసుకోండి: