తెలంగాణాలో కెసిఆర్ చెప్పిందే జరుగుతుంది.  తనకు నచ్చిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు.  రాష్ట్రం పాలన తన కనుసైగల్లో జరుగుతున్నది.  2018 ఎన్నికల్లో కెసిఆర్ ఊహించని విధంగా గెలుపొందటంతో ఆయనకు ఎదురు చెప్పలేకపోయారు ఎవరు.  


ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెరాస పార్టీ అనుకున్న సీట్లు గెలుచుకోలేకపోయింది.  తెలంగాణాలో కీలక స్థానాలైన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.  ఈ స్థానాలు తెరాస కు కీలకం.  ఇప్పుడు కెసిఆర్ ను కరీంనగర్ స్థానం ఇబ్బదులు పెడుతున్నది.  


కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలార్ తెరాస పార్టీపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం.  మూడుసార్లు ఆయన కరీంనగర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  మంత్రి పదవి వస్తుందని ఆశించినా లాభం లేకపోయింది.  పైగా ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కమలాకర్ తో మంతనాలు జరిపేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. 


ఒకవేళ కమలాకర్ లో అసంతృప్తి ఉంటె.. ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించే విధంగా బండి సంజయ్ అడుగులు వేస్తున్నారని సమాచారం.  వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బీజేపీ బలపడాలని చూస్తోంది.  ఆదిశగా పావులు కడుపుతుండటంతో.. తెరాస పార్టీ ఆత్మరక్షణలో పడింది.  గంగుల కమలాకర్ కు మంత్రి పదవిని ఇవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: