చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఉంటె రాష్ట్రంలో వర్షాలు కురవవు అనే నానుడి ఉండేది.  ఆ నానుడి నిజమే అని అందరికి తెలుసు.  గతంలో బాబు అధికారంలో ఉండగా వానలు కురవలేదు.  దీంతో అందరు భయపడిపోయారు. బహుశా ఈసారి బాబు ఓడిపోవడానికి వాన దేవుడు కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు.  


ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు.  జగన్ ప్రమాణస్వీకారం రోజున భారీ వర్షం కురిసింది.  అందరు సంతోషించారు.  జగన్ ప్రమాణస్వీకారం రోజున వాన కురిసింది.  అది శుభసూచికం.  రాష్ట్రం పచ్చగా ఉంటుంది అనుకున్నారు.  కానీ, ఆ మాటలు కొన్ని రోజులకే పరిమితం అయ్యాయి.  


జూన్ మాసం ముగిసింది.  ఇప్పటికే వానలు కురవాలి.  ఏరువాక మొదలుకావాలి.  జూన్ మొత్తం మీద సాధారణ వర్షం కూడా కురవలేదు.  దీంతో రైతులు ఢీలా పడ్డారు.  పొలం సాగుచేయాలి వద్దా అనే అయోమయంలో పడ్డారు.  దుక్కి దున్నిన తరువాత నీరు కావాలి.  నీళ్లు లేకుంటే దున్నిన దుక్కి వృధా అవుతుంది. 


ఆకాశం మాత్రం మేఘావృతం అవుతుంది.  వాన మాత్రం కురవడం లేదు.  అటు ఆంధ్రాలోనే కాదు.. ఇటు తెలంగాణాలో సైతం వర్షం లేదు.  ఎగువ మహారాష్ట్రలో మాత్రం జోరున వానలు కురుస్తున్నాయి.  ముంబై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి.  అప్పుడు బాబుకు, ఇప్పుడు జగన్ కు వాన దేవుడు కామన్ శత్రువుగా మారిపోయాడుగా.  


మరింత సమాచారం తెలుసుకోండి: