అధికారంలోకి వచ్చిన వెంటనే తానూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని జగన్ చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా మొదటి అడుగు పడింది. సాయంత్రం ఆరు గంట‌లు దాటితే ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ చేసే ప్ర‌తిపాద‌న సిద్దం అయింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల త‌ర‌హాలోనే ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌రకు మాత్ర‌మే మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో కీల‌క‌మైన బ్రాండ్ల‌ను సైతం త‌గ్గించాల‌ని ఏపి ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. 


తాను అధికారంలోకి వ‌స్తే ఏపీలో మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తాన‌ని ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. న‌వ‌ర‌త్నా ల్లోనూ ప్ర‌కటించారు. అయిదేళ్ల కాలంలో ద‌శ‌ల వారీగా మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తూ..కేవ‌లం స్టార్ హోట‌ళ్లలో మాత్ర మే అందుబాటులో ఉండేలా చేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. దీనిలో భాగంగా ఏపీలో మ‌ద్యం వినియోగాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు సిద్దం అయ్యాయి. ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు వీటిని అధికారులు సిద్దం చేసారు.


అందులో భాగంగా ఇక నుండి ఏపీలో మ‌ద్యం విక్ర‌యాలు ప్ర‌స్తుతం ఉద‌యం 10 గంట‌ల నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఉండ‌గా..ఇక నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ నుండి అమ‌ల్లోకి వ‌చ్చే కొత్త ఎక్సైజ్ పాల‌సీలో ఈ ప్ర‌తిపాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. మందుప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగు తారు. ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా. 


మరింత సమాచారం తెలుసుకోండి: