పైన పేర్కొన్న ఇద్దరు నేతలు ఉమ్మడి ఏపీలో ప్రజలకు దైవ సమానులు. ఇద్దరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అన్న నందమూరి సొంతంగా పార్టీ పెట్టి అద్భుతమైన ప్రజాదరణ చూరగొన్నారు. ఇక వైఎస్ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో ఉండి తనను తనను తాను రుజువు చేసుకున్నారు. అంతే కాదు, ఎన్నో ప్రజా హిత కార్యక్రమాలు చేపట్టి జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు.


ఇదిలా ఉండగా అన్న నందమూరికి ఎవరికీ జరగని అవమానం చరిత్రలో జరిగింది. ఆయన్ని కుటుంబ సభ్యులే వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్నారు. ఇక ఆయన జయంతులు, వర్ధంతులు కూడా మొక్కుబడిగా చేయడం తప్ప ఆయనకు ఎక్కడా పేరు తెచ్చే కార్యక్రమాలు వారసులు చేపట్టలేకపోయారు. అదే వైఎస్  కుటుంబం విషయానికి వస్తే ఆ కుటుంబం  వైఎస్  పేరుని చరిత్రలో చిరకాలం నిలిపేలా చేసింది.


అందుకోసం ఒక్కటిగా కుటుంబం పదేళ్ల పాటు పోరాడింది. తండ్రి జయంత్రి వేళ సీఎం హోదాలో జగన్ నివాళి అర్పించడం అంటే ఒదొక గొప్ప సంఘటన. చరిత్రలో మరెవరూ చేయలేని సంఘటన. తండ్రి పేరు పదేళ్ళుగా తాను స్మరిస్తూ జనంలో ఉంచుతూ ఆయన  ఖ్యాతిని దిశ దిశలూ వ్యాపింపచేసిన జగన్ నిజంగా గొప్ప కుమారుడు. రైతు దినోత్సవంగా  తండ్రి జయంతిని ప్రకటించి ఆయన పేరును శాశ్వతం చేశారు.


నిజంగా అన్న నందమూరి పేరుని నారా కుటుంబం నాశనం చేస్తూంటే వారసులు పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ వైఎస్ పేరును కలకాలం నిలబెట్టేందుకు   కుటుంబం అంతా ఒక్కటిగా ఉన్న వైనాన్ని తెలుగు ప్రజలు చూస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ కుమారుడుగా జగన్ కూడా చరితార్ధుడు అనిపించారు. తండ్రి కంటే గొప్ప పాలన చేయాలని ఆయన తపిస్తున్న తీరు కూడా అద్భుతం.



మరింత సమాచారం తెలుసుకోండి: