సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేకూరేలా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్లో భారీ ఎత్తున గ్రామ వలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం యొక్క పథకాలను నేరుగా ప్రజలకు చేర్చటానికి, అర్హులైన ప్రజలందరికీ పథకాలు అందేలా చేయటానికి ప్రభుత్వం వీరిని వినియోగించుకోబోతుంది. 
 
ఈ గ్రామ వలంటీర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారు ఎవరైనా అవినీతి చేసినట్లు తేలితే ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పారు. అర్హులైన ప్రజలకు పథకాలను అందించడంలో నిర్లక్ష్యం వహించినా చర్యలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డిగారు అన్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ వలంటీర్లు ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. 
 
ఆగస్ట్ 15 తరువాత ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనలో గ్రామ వలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. సన్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు గ్రామ వలంటీర్లే పంపిణీ చేయబోతున్నారు. ఫించన్ కూడా అర్హులైన వారికి వలంటీర్లే ఇంటికి వచ్చి అందించబోతున్నారు. ఇలా అన్ని పథకాల అమలులో కీలక పాత్ర పోషించే గ్రామ వలంటీర్లు అవినీతి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే హెచ్చరించి మంచి పని చేసారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: