కేంద్రంలో వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి నామమాత్రంగా కూడా ఓట్లు దక్కలేదు. బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కేంద్రంలో అంత బలంగా ఉండి రాష్ట్రంలో బీజేపీ ఇంత బలహీనంగా ఉండటానికి కారణం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకత్వం లేకపోవడమే. 
 
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బలపడటానికి ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉంది. కొన్ని ఎంపీ సీట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది బీజేపీ పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అందుకే ఇప్పుడు ప్రజల్లో బాగా గుర్తింపు పొందిన నాయకుల కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. 
 
ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి, పవన్ కల్యాణ్ బీజేపీ పార్టీలో చేర్చుకోవాలని, పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నిస్తుంది బీజేపీ పార్టీ. పవన్ కల్యాణ్ మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ స్థానంలోకి భవిష్యత్తులోనైనా రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. మరి ఆ ప్రయత్నాలు నెరవేరుతాయో లేదో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: