పై స్ధాయిలో ఉన్నతాధికారుల మాటఎలాగున్నా క్రిందస్ధాయిలో మాత్రం కొందరు అధికారుల్లో ఎలాంటి రాలేదని అర్ధమవుతోంది. అందులోను చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో కొందరు అధికారులు ఇప్పటికీ చంద్రబాబునే సిఎంగా తాజాగా అనుకుంటున్నట్లున్నారు. అందుకు జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. 

 

దివంగత నేత వైఎస్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. అందులో వైఎస్ బడిబాట కూడా ఒకటి. ఈ కార్యక్రమంలో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధినులకు సైకిళ్ళను ఉచితంగా పంపిణీ చేయటం కూడా ఒకటి. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఎత్తున సైకిళ్ళ పంపిణీని చేపట్టింది.

 

మొన్నటి ఎన్నికల సందర్భంగా సైకిళ్ళను పంపిణీ చేయటానికి అప్పట్లో చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున సైకిళ్ళను కొనుగోలు చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా చాలా చోట్ల సైకిళ్ళ పంపిణి జరగలేదు. అందుకని అప్పట్లో కొనుగులో చేసిన, తాజాగా కొన్న సైకిళ్ళతో కలిపి పంపిణీ చేస్తోంది.

 

ఇక్కడ విషయం ఏమిటంటే ఎన్నికలకు ముందు సేకరించిన సైకిళ్ళపై చంద్రబాబు, గంటా శ్రీనివాస్ స్టిక్కర్లను అంటించారు. ఆ స్టిక్కర్లను అలాగే ఉంచి ఇపుడు జిల్లాలోని పీలేరులో అధికారులు పంపిణీ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు స్టిక్కర్లున్న సైకిళ్ళను పంపిణీ చేస్తున్నారన్నమాట. కొందరు అధికారులకు చంద్రబాబు మీద అభిమానం పోయినట్లు లేదు. అందుకనే ఈ సైకిళ్ళను పంపిణీ చేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: