చంద్రబాబుకు ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది. అయితే ఎన్నికల్లో పరాజయం పొంది కనీసం నెల రోజులు గడవక ముందే టీడీపీ కార్యకర్తల మీద దాడులంటూ కొత్త నాటకానికి తెర లేపారు. కానీ ప్రజలేం అమాయకులేం కాదు కదా జనాలకు అన్ని తెలుసు కాబట్టి పచ్చ మీడియా ఎంతగా ప్రయత్నించినా టీడీపీ ఓటమిని ఆపలేకపోయింది. అయితే పల్లెల్లో టీడీపీ కార్యకర్తలను పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని, లేకపోతే దాడులు చేస్తున్నారంటూ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ మారనంత మాత్రాన, వైసీపీకి జై కొట్టనంత మాత్రాన దాడులు చేస్తారా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన, జరుగుతున్న దాడులన్నిటికీ రాజకీయ రంగుపులిమి పబ్బం గడుపుకుంటున్నారు టీడీపీ నేతలు.


అయితే అసలు పార్టీ మారాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఒత్తిడి చేస్తున్నదెవరో తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేలు గోడదూకుతామని సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేయాల్సిందేనంటూ కండిషన్ పెట్టిన సీఎం జగన్ కార్యకర్తలను చేర్చుకోవాలని కిందిస్థాయి నేతల్ని తొందరపెడతారా? అలా చేర్చుకోవాలని అనుకుంటే వేలాదిమంది మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు.


వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతోటే ఇలాంటి వారందర్నీ పక్కనపెట్టారు ఎమ్మెల్యేలు, జిల్లానేతలు. అలాంటిది కొన్నిచోట్ల పార్టీ మారలేదని టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటే అది నమ్మశక్యమేనా? జగన్ కనుసైగ చేస్తే చాలు.. బాబు, బామ్మర్ది తప్ప టీడీపీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. అయినా కూడా రాజకీయ విలువల కోసం జగన్ ఆ పనిచేయడం లేదు, ఆదర్శవంతమైన రాజకీయాల గురించి చెప్పడమే కాదు, చేతల్లో చూపిస్తున్నారు జగన్. అలాంటి జగన్ పై నిందలు వేయడానికి పూనుకుంది టీడీపీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: