ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మరొకసారి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు . టీడీపీ ప్రభుత్వ హయాం లో ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం ఎత్తివేస్తోందన్న ఆయన ,  45 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అనేక టర్న్ లు తీసుకున్నారని ఆరోపించారు . చంద్రన్న భీమా, యువనేస్తం, పసుపు కుంకుమ, రంజాన్ తోఫా,ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన  పథకాలను వైకాపా ప్రభుత్వం ఆపేసింది విమర్శించారు . టీడీపీ ప్రభుత్వ హయాం లో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ఎత్తేస్తే...ప్రజలు జగన్ ను ఎత్తేస్తారని ఎద్దేవా చేశారు .


 అమ్మఒడి అంటూ ఆర్భాటంగా ప్రభుత్వమైతే ప్రకటనలు చేసింది కానీ , అమ్మ ఒడి పథకాన్ని  ఎవరికి ఇవ్వాలో మంత్రులకే అవగాహన లేదని లోకేష్ అన్నారు . హనుమాన్ జoక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటికి హారతి ఇచ్చారు   నారా లోకేష్‌. గత మూడేళ్లు వరుసగా జలసిరికి హారతిని  తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన విషయం తెల్సిందే . ఈసారి పార్టీ తరపున  నిర్వహించిన కార్యక్రమంలో దేవినేని ఉమా, జవహర్, వంశీ, బచ్చుల అర్జనుడు, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు .


రాయలసీమ లో విత్తనాలు ఇవ్వకుండా రైతు దినోత్సవం చేశారని, వైకాపా  మేనిఫెస్టో అమలులో కూడా కండిషన్స్ అప్లై అంటున్నారని లోకేష్ అపహాస్యం చేశారు .రాష్ట్రం లో అన్ని నిర్మాణాలు ఆగిపోయాయని , అమరావతి లో దొంగలు పడి  ...స్టీలు సిమెంట్ కూడా ఎత్తుకుపోతున్నారన్నారు . టిడిపి కార్యకర్తల పై దాడులు ఆపాలని , ఇంత కాలం ఓపికగా ఉన్నాం... ఇక  టీడీపీ కార్యకర్తలు  తిరగ బడితే  వైకాపా వాళ్ళు గ్రామాల్లో ఉండలేరని హెచ్చరించారు

 


మరింత సమాచారం తెలుసుకోండి: