ఇపుడిదే అనుమనం అందరిలోను పెరిగిపోతోంది. జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు గిరగిరా తిరుగుతుండే చంద్రబాబు చక్రం ఇపుడెందుకు తిరగటం లేదో తెలియటం లేదు. కర్నాటకలో తాను ఏర్పాటు చేయించిన ప్రభుత్వమే పతనం అంచున ఉంది. మరి కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడటానికి చంద్రబాబు చక్రం ఎందుకు తిప్పటం లేదు ?

 

పోయిన ఏడాది కర్నాటక ఎన్నికల్లో తానే చక్రం తిప్పినట్లు చంద్రబాబు విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. చంద్రబాబు వల్ల కర్నాటకలో బిజెపి అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయినట్లు భజన చేయించుకున్నారు మీడియాలో. కాంగ్రెస్-జేడిఎస్ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కూడా చంద్రబాబే చక్రం తిప్పారని రాయించుకున్నారు భజన మీడియాలో.

 

అంతా బాగానే ఉంది. దేశవ్యాప్తంగా చక్రం తిప్పగలిగిన చంద్రబాబు సొంత రాష్ట్రంలో మాత్రం తిప్పలేకపోయారు.  మొన్నటి ఎన్నికల్లో చరిత్రలోనే ఎప్పుడూ ఎదురుకానంత ఘోరంగా ఓడిపోయింది. ఆ సంగతిని పక్కనపెట్టినా కర్నాటక రాజకీయాలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదన్నదే చాలామందికి అర్ధంకాని ప్రశ్న.

 

కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పి మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కావాల్సినంత తీరిక ఇపుడు చంద్రబాబుకు ఉంది కదా ? అయినా పట్టించుకున్నట్లు కనబడలేదు. లేకపోతే ఈ పాటికే అక్కడకు వెళ్ళిపోయేవారే. నిజానికి సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు లాంటి సీనియర్ నేత అవసరం చాలాఉంది. రెండు పార్టీల ఎంఎల్ఏలను క్యాంపులకు తరలించటం, డిమాండ్లను పరిష్కరించటం లాంటి వాటిల్లో చంద్రబాబుకు అనుభవం కూడా ఉంది. కాబట్టి వెంటనే చంద్రబాబు చక్రం తిప్పటం మొదలుపెడితే బాగుంటుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: