ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే.  గత ప్రభుత్వం చేసిన ఏ తప్పూ తన ప్రభుత్వంలో జరగకూడదని..ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచి తమను గెలిపించారని..వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి అడుగూ ఆచీ..తూచీ వేయాలని తన మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు, అధికాకులకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ నేపథ్యంలో  సీఎం వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై ఈరోజు సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా  ‘స్పందన’ కార్యక్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, ఆర్టీలు వెంటనే పరిగణలోకి తీసుకోవాలని, సత్వరమే పరిష్కారానికి ఉపక్రమించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: