ప్రమాదాలు ఎలా వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. కొన్నిసార్లు అనుకోని సంఘటనల్లో ఉన్నట్టుండి ప్రమాదంలో పడిపోతుంటారు.  తాజాగా గోదావరి వరద కొంత మంది పోలీసులకు పాలిట శాపమైంది..అదృష్టం బాగుండి ప్రమాదం నుంచి బయట పడ్డారు.  వివరాల్లోకి వెళితే..తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వద్ద గోదారి వరద ఉదృతి తీవ్రతరంగా ఉంది.

గోదావరిలో హైటెన్షన్ టవర్లు నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు రావడంతో జేసీబీ మునిగిపోయింది. దాంతో అక్కడ ఉన్న ఓ డ్రైవర్ వరద నీటిలో చిక్కుకున్నాడు. వెంటనే స్పందించిన ఆత్రేయపురం ఎస్‌ఐ, పోలీసులు ఆ జేసీబీ డ్రైవర్ ని రక్షించేందుకు ధైరం చేసి వెళ్లారు..కానీ వారు కూడా ఆ వరద నీటిలో చిక్కుకున్నారు.

విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ కృష్ణ నాటుపడవపై వెళ్లి పోలీసులను రక్షించారు. జేసీబీ వరద నీటిలో కొట్టుకుపోయింది. మొత్తానికి అందరూ క్షేమంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: