క్రీడల్లో ఏ ఆటగాడి కెరీర్ అయినా 40 ఏళ్ల వరకే ఉంటుంది. ఇందుకు క్రికెట్ మినహాయింపు కాదు. ఇరవైల్లో ఆటలోకి రావటంతో సక్సెస్ ఫుల్ ఆటగాళ్లు దాదాపు 15 నుంచి 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఆడేస్తారు. సచిన్ సుధీర్ఘంగా 24 ఏళ్లపాటు క్రికెట్ ఆడి 40వ వడిలో ఆటకు గుడ్ బై చెప్పాడు. సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్.. ఇలా అందరూ 40కి రాగానే లేదా ఇంకొంత ముందుగానే ఆట నుంచి రిటైర్ అయిపోయారు.


ధోనీలో ఇంకా ఆడే శక్తి ఉంది. కానీ.. వరల్డ్ కప్ తరువాత రిటైర్ అవుతాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ధోనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. ధోనీపై ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే.. ధోనీ రాజకీయ రంగ ప్రవేశం. ధోనీ రిటైరయ్యాక రాజకీయాల్లోకి వస్తాడని ఆ వార్త సారాంశం. ధోనీ బీజేపీలో చేరతాడని ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రముఖులతో చర్చించినట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఝార్ఖండ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ధోనీ పోటీ చేస్తాడనే వార్తలు వైరల్ గా మారాయి. 


సాధారణంగా రిటైరైన ఆటగాళ్లు అదే రంగంలో కామెంటేటర్ గానో, అనలిస్ట్ గానో, బిజినెస్ లోనో స్థిరపడతారు. కాకపోతే ధోనీ స్పెషల్ కాబట్టి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ధోనీ మిలిటరీలో పారాచ్యూట్ రెజిమెంట్ లో లెఫ్ట్ నెంట్ కల్నల్ హోదా లో ఉన్నాడు. మరి ధోనీ ఎప్పుడు రిటైర్ అయినా మిలటరీ హోదాలోనే ఉంటాడా, నిజంగా రాజకీయాల్లోకి వస్తాడా.. అనేది ధోనీనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: