తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్‌, ట్విట్టర్ వేధికగా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు కాస్తా వివాదాలకు ధరి తీస్తున్నాయి. నిన్నటికి నిన్న '' ఆంధ్రప్రదేశ్ ని పగపట్టిన పాములే పరిపాలిస్తున్నాయి అని పరోక్షంగా వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యం రైతుల రాజ్యం కాదు అని, అధర్మ రాజ్యం అని ట్విట్టర్ వేధికగా ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనరాని మాటలు అన్నారు. 


ఈ మాటలకూ ఎంతో మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు లోకేష్ చేసే విమర్శలకు అర్ధం కూడా లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటున్నారు కొంతమంది, మరికొంతమంది ఘాటుగా ఆయనకు సమాధానం ఇస్తున్నారు. రాజన్న రాజ్యం రైతుల కోసమే అని ప్రతిఒక్కరికి తెలుసు కానీ రైతు రాజ్యాన్ని అధర్మ రాజ్యం అని ఎలా అంటారు అంటూ పోస్ట్ చేశారు. కాగా కొంతమంది మీ నాన్న ఎం చేశాడో కాస్త చెప్పు బాబు అని, మీ నాన్న వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ ఇలా అయ్యింది అని నెటిజన్లు నారా లోకేష్ పై కారాలు మిరియాలు నూరారు. 


కాగా ఈరోజు సరికొత్తగా నారా లోకేష్ ట్విట్ చేస్తూ ''తెదేపా సిద్ధం చేసి ఉంచిన బడికొస్తా సైకిళ్ళకి బడిబాట స్టిక్కర్! బాగుంది కానీ, ఎంత స్టిక్కర్ వేసినా తెదేపా చేసింది పచ్చబొట్టులాంటి అభివృద్ధి. దాన్ని మరుగున పడేయడం మీవల్ల కాదు. గత ఐదేళ్ళూ మేము చేసిన వాటికి మీ స్టిక్కర్లు అంటించుకుంటూ పొతే మీకు వచ్చే ఐదేళ్ళూ చాలవు @ysjagan గారూ!'' అని వీడియో జత చేసి పోస్ట్ చేసారు.. అయితే ఈ ట్విట్ కు కొందరు టీడీపీ అభిమానులు జగన్ ను 'స్టికర్ సీఎం' అని కామెంట్లు చేసారు. వీటిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు 'ఎవరు ఈ సైకిళ్ళను కొన్నారు అని కాదు.. ఎవరు ప్రజలకు వీటిని అందచేశారు అనేది ముఖ్యం అంటూ బదులు సమాధానం ఇచ్చారు'. కాగా కొంతమంది మీరు అప్పడాలపై కూడా మీ బొమ్మ వేయిచుకున్నారు కదా అని కామెంట్ చేశారు. మరికొంతమంది ఈ వీడియో ఫేక్, ఈ న్యూస్ ఫేక్, ఈ లోకేష్ ఫేక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: