చూడబోతే అలాగే ఉంది జరుగుతున్నది చూస్తుంటే. నిజానికి వాళ్ళందరూ ఐఏఎస్ అధికారులే. కానీ ఆ విషయాన్ని వారు మరచిపోయి చంద్రబాబునాయుడు భక్తులుగా మారిపోయారు. దాంతో చంద్రబాబు చెప్పిన ప్రతీ అడ్డమైన పని చేయటం లేకపోతే చంద్రబాబు మెప్పుకోసం వాస్తవాలను దాచిపెట్టారు.

 

ఈ విధంగా ఐదేళ్ళు జరిగింది. ఫలితంగా చంద్రబాబు నిండా ముణిగాడు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అటువంటి భక్తుల్లో చాలామందికి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడికి అటాచ్ చేశారు. ఈ పాటికే వాళ్ళెవరూ అర్ధమైపోయుంటుంది.

 

సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, అహ్మద్ బాబు, ఏబి వెంకటేశ్వరరావు అండ్ కో అంతా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జీఏడిలో ఉంటూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. డిజిపిగా చేసిన ఆర్పి ఠాకూర్ కూడా మినహాయింపు కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పైన చెప్పిన వాళ్ళంతా చక్రం తిప్పిన వాళ్ళే. అపరిమతమైన అధికారాలను అనుభవించినవారే. కొందరైతే చంద్రబాబు మెప్పుకోసం ప్రత్యర్ధులను ఎంతగానో వేధించారు.

 

నిజానికి వాళ్ళంతా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులమన్న విషయం మరచిపోయారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మహా అయితే ఐదేళ్ళే. ఆ తర్వాత మళ్ళీ జనాల తీర్పు కోసం వెళ్ళక తప్పదు. కానీ ఐఏఎస్, ఐపిఎస్ లు అలా కాదు. సర్వీసుకు ఎంపికైన దగ్గర నుండి రిటైర్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 35 ఏళ్ళు ఢోకా ఉండదు. వాళ్ళంతా సిఎంలుగా ఎవరున్నా ప్రభుత్వానికి మాత్రమే విధేయులుగా ఉండాలి.  కానీ ఆ విషయం మరచిపోయి ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని తెలుసుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: