ట్విట్టర్ ఓపెన్ చేస్తే రెండు రెండు ట్యాగ్స్ ఎక్కువ రొటిన్ అవుతున్నాయి.  అందులో ఒకటి  క్రికెట్ వరల్డ్ కప్ కాగా రెండోది కర్ణాటక పాలిటిక్స్.  ఈరోజు ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమిస్ జరుగుతున్నది.  మ్యాచ్ స్టార్ అయినప్పటి నుంచి ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.  


మ్యాచ్ జరుగుతుందా లేదా.. జరిగితే ఎవరు గెలుస్తారు అనే దానిపై ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.  ఒకవేళ సడెన్ గా వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా నెటిజన్లు ఈ ట్యాగ్ పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటను నిలిపేశారు.  అట నిలిపిన తరువాత జరిగిన పరిణామాల గురించి కూడా ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. 


ఈ ట్యాగ్ తో పాటు మరో ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతున్నది. అదే కర్ణాటక పాలిటిక్స్ క్రైసిస్.  కర్ణాటకలో అసలేం జరుగుతున్నది అనే దానిగురించి ట్రెండ్ అవుతున్నది.  కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.  ఎలా సంక్షోభం నుంచి బయటపడాలా అని ఆలోచిస్తోంది.  


బీజేపీ మాత్రం ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా గమ్మున ఉండిపోయింది.  దీనికి కారణాలు ఉన్నాయి.  సంక్షోభంలో పడి సర్కార్ కూలిపోతే.. ఆ తరువాత అధికారం చేపట్టాలసింది బీజేపీనే.  అందుకే సైలెంట్ ఉన్నది.  కర్ణాటక పొలిటికల్ క్రైసిస్ ట్యాగ్ కూడా ఉదయం నుంచి ట్రెండ్ అవుతుండటంవిశేషం .  


మరింత సమాచారం తెలుసుకోండి: