వాట్సప్.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి సెల్ ఫోన్ లోనూ ఉంటున్న యాప్ ఇది. ఇంతగా వేరే ఏ యాప్ కూడా పాపులర్ కాలేదేమో.. క్షణాల్లో వందల మందికి సమాచారం చేరే అవకాశం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఈ వాట్సప్ ద్వారా సులభమైంది.


కానీ ఈ వాట్సప్ ద్వారా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. సైనికులు వంటి వారు ఈ వాట్సప్ గ్రూపుల్లో ఉంటే.. దేశ రహస్యాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అందుకే .. సైనికులను వాట్సప్ గ్రూపుల్లో చేరవద్దని ఆర్మీ అధికారులు హెచ్చరించారు.


సైనిక రహస్యాల కోసం గ్రూపుల ద్వారా సైనికులపై నిఘా వేసే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గ్రూపుల నుంచే మాల్​వేర్​ఎటాక్​చేసి, ఫోన్​లోని సమాచారం మొత్తం దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రూపుల ద్వారా కాకుండా వన్ టు వన్ మెస్సెజ్ పంపుకోవాలని సూచించారు.


ఆర్మీకి సంబంధించిన వివరాలు కానీ, తమ పోస్టింగ్​వివరాలు కానీ సోషల్​మీడియాలో పోస్ట్​ చేయకూడదన్నది సైన్యం నిబంధన. ప్రతీ సైనికుడు దీనిని తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనంటున్నారు అధికారులు. అవును మరి దేశ భద్రత కంటే సోషల్ మీడియా ఎక్కువ కాదు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: