సోంపేట మండలంలో పలాసపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , టిడిపి పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణ ఘర్షణకు దారితీసింది. ఆదివారం ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సోంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదును నమోదుచేసి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. 


సోంపేట పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు కళా వెంకట రావు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే  అశోక్ , గౌతు శిరీష్ చేరుకుంటున్నారని తెలిసి, వైఎస్సార్  సీపీ సమన్వయ కర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సుమారు రెండు గంటల సమయం నాటికీ ఉద్రిక్త పరిణామాలకు చేసుకున్నారు. సోంపేటలో ఎం జరుగుతుందో తెలియక ప్రజలందు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. డివిజన్ పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తు చర్యలు తీసుకున్నారు. 


టీడీపీ నాయకులు కావాలనే వివాదాలు సృష్టించడం, వివాధ చర్యలకు పాల్పడడం చేస్తున్నారని డిఎస్పీ  వి.ఎస్.ఎన్.సాయిరాజ్ ఫిర్యాదు చేసారు.  స్థానిక ఎమ్మెల్యే బి.అశోక్ , టీడీపీ నాయకులు తన సొంత గ్రామం పలాసపురంలో అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యారని అన్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని తన సొంత గ్రామంలో గొడవలు రేకెత్తించడం , తమ పార్టీ  కార్యకర్తలపై చెయ్యిచేసుకుని ఆందోళన సృష్టించారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: