ఎన్నో అంచనాలతో  మరెన్నో ఆశలతో  మొత్తానికి  భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా పదవి  చేపట్టాడు జగన్. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నాడు. ముఖ్యంగా  తాను ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జగన్ అధికారాన్ని చేపట్టాక  రాజధాని పనులు ముందుకు సాగడం లేదు. ఒకవేళ పనులన్నీ ఆపేస్తే.. అభివృద్ధి ఆగిపోయిందనే అపవాదును జగన్  ఎదురుకోవాలి. ఎలాగూ ప్రత్యేకహోదా విషయంలో జగన్ చేసేది ఏమి లేదు, ఇపుడు ఈ రాజధాని విషయంలో కూడా ఏమి చెయ్యకపొతే జగన్ పూర్తిగా మునిగిపోవడమే. 

మరోపక్క  రాజధాని విషయంలో జగన్  ఇప్పటికే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారని..  రాజధానినిగా అమరావతిని  మార్చికపోయినా.. అమరావతిలో చేసే పలు అభివృద్ధి పనులను  దోనకొండలో చేయాలని జగన్ భావిస్తున్నాడని వైసీపీ నాయకుల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో దోనకొండను రాజధానిగా పరిశీలిస్తే,  చంద్రబాబు తన అనుచరుల కోసం ముందుగానే అమరావతిలో భూములు కొనిపించి.. రాజధానిగా అక్కడ పెట్టారట.  పైగా అందులో పెద్ద అవినీతికి పాలపడ్డారట.  

 అందుకే రాజధానిని దోనకొండకు మారుస్తే ప్రజలకు, ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని జగన్ అనుకుంటున్నట్టు పార్టీ నాయకులూ లీకులు వదులుతున్నారు. అయితే  ఇప్పుడు రాజధాన్ని  దొనకొండకి మార్చి ఎప్పుడు కట్టాలని..? ఒకవేళ మారిస్తే.. జగన్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.  మరి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: