చంద్రబాబుకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోందని చెప్పడానికి ఇంత కంటే వేరే ఉదాహరణ అవసరం లేదనుకుంటారు. ఓవైపు పార్టీ నుంచి వలసలు.. మరోవైపు ఆయన సన్నిహితులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు..చివరకు ఒకప్పుడు ఈడీలో పని చేసిన అధికారులపై కూడా దాడులు జరుగుతున్నాయంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తాజాగా.. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ బొల్లినేని గాంధీకి ఇంటిలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ జీఎస్టీ యాంటీ ఏవేజన్ సెక్షన్ లో ఆయన సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు.. విజయవాడలోని అతని నివాసంలో సోదాలుజరిగాయి.


ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గతంలోనే గాంధీపై.. కేసులు నమోదయ్యాయి. తాజా దాడుల్లో నాలుగు కోట్ల విలువైన అక్రమాస్తులున్నట్టు గుర్తించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి గాంధీ సన్నిహితుడని పేరుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను ఈయనే నిర్వహించారు. ఆ సమయంలోనే జగన్ పై ఉన్నవి, లేనివి కేసులు పెట్టడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి.


ఈడి శాఖలో ఉన్నప్పడు బొల్లినేని గాంధీ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబుకు సన్నిహితుడు అయిన ఈ అదికారి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీల జిఎస్టి కేసులో ఫైళ్లలో పలు మార్పులు చేశారని చంద్రబాబు సలహాల మేరకే నడుచుకున్నారని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: