మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా తివరే ఆనకట్టకు గండి పడింది.  దీనికరణంగా కింద ఉన్న చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.  గండి కారణంగా వచ్చిన నీటి వలన దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.  అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  దీనిపై మహారాష్ట్ర జలవనరుల మంత్రి తానాజీ స్పందించారు.  


ఆయన స్పందన దారుణంగా ఉన్నది.  గండి పాడటానికి కారణం పీతలు అంటూ మాట్లాడారు.  పీతలు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉండటం వలన గండి తెగిందని  చెప్పడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  అసలే ప్రాణాలు కోల్పోయి ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.  


సావంత్‌ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. మంత్రి నివాసానికి వెళ్లి తమతో తెచ్చుకున్న పీతలను ఆ ఇంటి గుమ్మం ముందు వదిలారు. పదుల సంఖ్యలో పీతలు ఆ ఇంట్లోకి, ఇంటి చుట్టుపక్కలకు పరుగులు తీశాయి. 


‘‘ఇందులో మా తప్పు ఏముంది? మేము నేరస్థులము కాము’’ అని పీతలు అంటున్నట్లుగా కార్యకర్తలు బ్యానర్లను ప్రదర్శించారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి.  బీజేపీ ప్రభుత్వానికి ఇది మాయని మచ్చలా మిగిలిపోతుంది.  ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: