ఏపీ సర్కారు నవరత్నాల అమలును చాలా సీరియస్ గా తీసుకుంటోంది. మానిఫెస్టోను అక్షరాలా అమలు చేయాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లోనూ దీనికే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన ఆదేశం.


అయితే నవరత్నాల పేరుతో ఉన్నపథకాలు తీసేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శిస్తున్నారు. చంద్రన్న బీమా, యువనేస్తం, పసుపు కుంకుమ, రంజాన్ తోఫా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు ఆపేశారని మండిపడుతున్నారు.


అన్ని సంక్షేమ పథకాలు ఎత్తేస్తే.. ప్రజలు మిమ్మల్ని ఎత్తేస్తారు జగన్ గారు ! ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి... అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. నెలరోజుల్లో జగన్ గారు ఎన్నో యూ టర్న్ లు తీసుకున్నారన్నారు.


వైసీపీ మేనిఫెస్టోలో ప్రతి హామీకి స్టార్ మార్క్ పెట్టి కింద కండిషన్స్ అప్లై అని పెట్టివుంటే బాగుండేది. కానీ జగన్ గారు ఇప్పుడు ప్రతి దానికి నిబంధనలు వర్తిస్తాయి అంటున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా ? అని లోకేశ్ కౌంటర్ ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: