చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే పార్టీలో మార్పులు చకచకా జరిగిపోతున్నాయి.  బాబుకు వీర విధేయుడిగా ఉన్న సుజనా చౌదరి తదితరులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  మరికొంతమంది తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  వీరితో పాటు మరికొందరు కూడా తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం.  


అయితే ఆ నాయకులని బుజ్జగించే యోచనలో చంద్రబాబు చాలా బిజిగా ఉన్నారని సమాచారం. కానీ ఆ నేతలు మాత్రం ఇంతకీ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఈమేరకు చంద్రబాబు తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొందరు నాయకులు మాత్రం రాజకీయ దిగ్గజంగా పేరున్న చంద్రబాబునే కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు. ఒకవైపు పార్టీలో ఉంటానని చెబుతూనే, మరొకవైపు వేరే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. 


ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు ఒకరు కేశినేని నాని కాగా, రెండో వ్యక్తి వల్లభనేని వంశి. కేశినేని నాని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతుంటే.. వల్లభనేని వంశి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నాడు.  ఈ మంతనాలు ఎందుకో ఏమిటో అన్నది తెలియాలి.  


 వీరిరువురు కూడా ఏ క్షణంలోనైనా కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని సమాచారం. కానీ వీరిద్దరూ కూడా పార్టీ వదిలేస్తే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.  ఇప్పటికే రాజ్యసభ సభ్యులను కోల్పోయింది.  రాష్ట్రంలో చాలామంది బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: