తెలంగాణా లో కెసిఆర్ హవా కొంతవరకు తగ్గిందనే చెప్పాలి.  పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆ దూకుడు తగ్గింది.  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తెరాస పార్టీ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంది.  దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.  


అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అనుకున్న సీట్లు గెలుచుకోలేకపోయింది.  దీంతో పార్టీపైన ముఖ్యంగా అధినేతపైన కొంత విముఖుత ఉన్నది.  గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు.  కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చి మంత్రిగా తప్పించారు.  ఇక రాష్ట్రంలో కీలక నేత హరీష్ రావును పక్కన పెట్టడం ఎన్నో అనుమానాలకు తెరతీసింది.  


హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే పార్టీ మారతారని అనునామాలు రావడంతో కెసిఆర్ అప్రమత్తం అయినట్టు సమాచారం.  త్వరలోనే కెసిఆర్ తన సొంత గ్రామం చింతమడకలో పర్యటించనున్నారు.  ఆ పర్యటనలో హరీష్ రావుకు మంత్రి పదవిపై అక్కడే ఓ క్లారిటీ ఇస్తారట. 


చింతమడక పర్యటన సందర్భంగా గ్రామంలో ఒక రోజు మొత్తం గడపనున్న కేసీఆర్, ఆ రోజు గ్రామంలో కెసిఆర్ మాట్లాడే అంశాలపై నాయకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పాలి. కాగా ఆరోజే కెసిఆర్, హరీష్ రావు కోసం మాట్లాడుతాడని, హరీష్ రావు తో పాటు మరికొందరిని కూడా తన మంత్రి వర్గం లోకి తీసుకుంటాడని సభాముఖంగా చెప్పనున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: