అధికారం మారినా కొన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా  ఇంకా తెలుగుదేశంపార్టీ నేతలే కంటిన్యు అవుతున్నారు. మామూలుగా అధికారం మారగానే అంతకుముందు ప్రభుత్వం నియమించిన నేతలందరూ ఛైర్మన్లుగా లేకపోతే నామినేటెడ్ పోస్టులకు రాజానీమాలు చేయటం సహజం. రాజీనామాలు చేయాలని లేదు కానీ రాజకీయ నియామకాలు కాబట్టి నైతికత మాత్రమే.

 

కానీ నిత్యం విలువలు, నీతులు గురించి మాట్లాడే చంద్రబాబు అండ్ కో మాత్రం గబ్బిల్లాలు లాగ ఇంకా కార్పొరేషన్లు పట్టుకుని వేలాడుతునే ఉన్నారు. మొన్ననే రాజీనామా చేసిన టిటిడి ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయటానికి ఎంత యాగీ చేసింది అందరూ చూసిందే. ఎవరో కొంతమంది మాత్రమే ఒకరితో చెప్పించుకోకుండా రాజీనామాలు చేశారు.

 

చంద్రబాబు హయాంలో నియమితులైన వారిలో ఇంకా ఓ పదిమంది నేతలు తమ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసేది లేదని గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారు. ఆర్టీసీ ఛైర్మన్ గా వర్ల రామయ్య, ఎస్సీ-కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా జూపూడి ప్రభాకర్, శాప్ ఛైర్మన్ గా అంకమ్మ చౌదరి, ఏపి పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగుల్ మీరా, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా దివి శివరామ్, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నామన రాంబాబు ఇంకా కంటిన్యు అవుతున్నారు.

 

రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ ఎంఎల్ఏలు, ఎంపిలు, మంత్రుల్లాంటివి సాధ్యంకాదు. అందుకే సీనియర్లకు, ప్రాధాన్యత కలిగిన నేతలకు సిఎంలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులిస్తుంటారు. టిడిపి హయాంలో నియమితులైన వారు గౌరవంగా రాజీనామాలు చేస్తేనే వైసిపి నేతలు నియమితులయ్యే అవకాశాలున్నాయి. కానీ వారెవరూ రాజీనామాలు చేయకుండా జగన్ ను ఇబ్బంది పెడదామని అనుకుంటున్నట్లున్నారు. కొంత కాలం చూసి వారందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలగించైనా కొత్తవారిని నియమిస్తుంది. అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: