ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ లోని ఓలిలో ఓ వివాహం జరిగింది.  ఈ వివాహానికి బాలీవుడ్ తారలతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, యోగ గురువులు హాజరయ్యారు.  పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.  దేశంలో అత్యంత వైభాగంగా జరిగిన పెళ్లిళ్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా మారింది.  


ఇంతవరకు బాగానే ఉంది.  ఇక్కడే అసలు కథ మొదలైంది.  ఇప్పుడు ఓలిలో ఎక్కడ చూసిన చెత్తా, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయింది.  ఇలా చెత్తా చెదారంతో నిండిపోవడంతో.. మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.  


టన్నుల కొద్దీ అక్కడ చెత్త పేరుకు పోయింది.  దీంతో పెళ్లి వారికి భారీ జరిమానా వేయాలని ఓలి మున్సిపల్ అధికారులు నిర్ణయించుకున్నారు.  ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదీ అని షాక్ అవుతున్నారా.. భారతదేశానికి చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. 


రకరకాల వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఈ ఏడాది గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముందుగా ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో శతకోటీశ్వరుడు అజయ్‌ గుప్తా కుమారుడు సూర్యకాంత్‌ వివాహం జరిగింది. కొద్దిరోజుల వ్యవధిలోనే అజయ్‌ సోదరుడు అతుల్‌ గుప్తా కుమారుడు శశాంక్‌ పెళ్లి జరిగింది. 

వీరి వివాహం వల్ల దాదాపు 40 క్వింటాళ్ల చెత్త పోగైందని, ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో ఓ బృందాన్ని నియమించామనీ అయినా సరే ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు కన్పిస్తున్నాయనీ మున్సిపల్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: