జగన్ ముఖ్యమంత్రి అయి గట్టిగా నెలన్నర కాలేదు. అపుడే సర్కార్ మీద టీడీపీ జల్లాల్సిన బురద జల్లుతోంది. జగన్ ఫెయిల్ అయ్యారని ఒకటే గోల పెడుతోంది. జగన్ అసమర్ధుడని కూడా జనంలో కలర్ పిక్చర్ ఇస్తోంది. మరి జగన్ మొదటి రోజు నుంచి కష్టపడుతున్నారు. కానీ ఎందుకిలా...


జగన్ తన మంత్రులను ఎంచుకున్నారు. నచ్చిన వారిని అధికారులుగా పెట్టుకున్నారు. కానీ పాలన మాత్రం గాడిన పడడం లేదు. దీంతో జగన్ లోనే తీవ్ర అసంత్రుప్తి కలుగుతోందట. ఏపిలో ఇరవై మంది ఐఎఎస్ అదికారుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ అసంతృఫ్తిగా ఉన్నారని సమాచారం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయడం లేదని, ఆశించిన వేగం చూపడం లేదని ఆయన భావిస్తున్నారట.ఇటీవల కొన్ని చోట్ల విత్తనాల సమస్య వస్తే వెంటనే స్పందించవలసిన అదికారులు అలా చేయలేదని ఆయన భావిస్తున్నారు.


ముందుగా తమ స్థాయిలో అదికారులు చర్యలు చేపట్టాలని,వారి చేతిలో లేకపోతే వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేసి తన వద్దకు తీసుకు రావాలని ఆయన చెబుతున్నారు. సంబందిత మంత్రులు, ఇన్ చార్జీ మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన అన్నారని భోగట్టా.


మరి అధికారులే చాలా ప్రభుత్వాల కొంపలు ముంచిన ఘనతను మూటకట్టుకున్నారు. ఎందుకంటే వారు పాతుకుపోయి ఉంటారు. మంచి చెడ్డా ఎక్కువగా వారి మీద ఆధరపడి ఉంటుంది. ఇపుడు జగన్ సర్కార్ కి అధికారుల సహకారం అనుకున్నంతగా అందడం లేదని తేలిపోయింది. జగన్ విరుగుడు గా ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: