బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో విష సర్పాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన పాములు కాదు.. పాముల పేరుతో రాజకీయ వాగ్బాణాలు జోరందుకున్నాయి.


ఈ విష సర్పాల వ్యవహారానికి నారా లోకేశ్ నాంది పలికారు. ఓ ట్వీట్ లో ఇలా అన్నారు.. “ వర్షాకాలంలో పాములు బైటికొచ్చి భయపెడుతున్నాయని పత్రికల్లో రాస్తున్నారు. కానీ ఏపీలో ఏకంగా పగపట్టిన పాములే రాజ్యమేలుతున్నాయి.” అంటూ విమర్శలు ప్రారంభించారు.


దీనిపై వైసీపీ నేతలు కూడా దీటుగానే కౌంటర్లు ఇస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే పి.సుధాకర్ బాబు ఇలా స్పందించారు.. “ లోకేష్ పాములు మళ్లీ వచ్చాయని అంటున్నారని నిజమే.. గత ఐదేళ్లుగా ఈ పాములు జనాన్ని పీడించాయని, జన్మభూమి కమిటీలు, ఇసుక మాఫియా కమిటీలు పాముల మాదిరే జనాన్ని వేధించారని అన్నారు. 175 మంది పాములు జనంలోకి వస్తే 151 పాములను జనం కొట్టి,కొట్టి చంపారని, కాని 23 మంది ఎల్లో స్నేక్స్ మాత్రం తప్పించుకున్నాయని ఆయన అన్నారు.వాటికి కూడా జనం బుద్ది చెబుతారని ఆయన అన్నారు.ప్రజలు సర్పయాగం చేశారని, అందువల్లే టిడిపి ఓటమి పాలైందని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు.


మాజీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. "మీ నాన్న ఓ రాజకీయ విష సర్పం. ఎన్నికల్లో ఆ సర్పం కోరలు ప్రజలే పీకేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేయలేని పనులను కేవలం నలభై రోజుల్లో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు.. అంటూ కౌంటర్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: