ఆంధ్రప్రదేశ్ లో ఆ మద్య తాడేపల్లి గురించి తెగ వార్తలు వచ్చాయి.  తాజాగా ఇప్పుడు తాడేపల్లిలో నిషేధాజ్ఞలు అంటూ మరో సంచలన వార్తలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయానికి వస్తే..తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని రేషన్ డీలర్లు నేడు ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ఇటీవల రేషన్ డీలర్ల విసయంలో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను మార్చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రేషన్ షాపుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి... గ్రామ వాలంటీర్ల ద్వారా... ఇంటికే సరుకుల్ని పంపిణీ చేయించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

ఆగస్టు 15 తర్వాత ఇది అమల్లోకి రాబోతోందని తెలిసింది.  దాంతో రేషన్ డీలర్లు తమకు అన్యాచం జరుగుతుందని పోరాటానికి సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని రేషన్ డీలర్లు నేడు ముట్టడిస్తారనే సమాచారం తేలుసుకున్న పోలీస్ అధికారులు  సీఎం నివాసం పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు.

తాడేపల్లిలో పోలీసు చట్టం అమల్లో ఉందని, అక్కడ ఆందోళనలు నిర్వహించవద్దని అర్బన్ ఎస్పీ రామకృష్ణ చెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  నిరంతర పరిశీలన, భద్రతా బలగాలతో పాటు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: