ఆకలి తీర్చే ఒక అద్భుతం !!
కడుపు నిండిన వాడికి పక్కవాడి డొక్కలోకి తొంగి చూసే టైం ఉండదు. కానీ, మానవత్వం ఉంటే ,దానికి తగిన ఆలోచన ఉంటే పేదోళ్ల ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదంటోంది, వనపర్తి మున్సిపాలిటీ..

మనం ఇళ్లలో తిన్న తరువాత మిగిలిన ఆహార పదార్ధాలను పారవేస్తాం అలా కాకుండా, వాటిని పేదలకు అందించే ఒక సౌలభ్యం ఉంది. వనపర్తి కొత్త బస్టాండ్‌లో శీతల గది ని వనపర్తి మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేశారు.

మిగిలిపోయిన ఆహార పదార్దాలను దానిలో ఉంచితే, ఆకలితో ఉన్న వారు వాటిని తీసుకెళ్ల వచ్చు. ఈ కార్యక్రమంలో పౌరులు పాల్గొని పదిమందికి సాయం చేయాలని కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: