కర్నాటక రాజకీయాలు  హై ఓల్టేజీ వపర్ తో నడుస్తున్నాయి. రెబల్ ఎంఎల్ఏలను బుజ్జగించి దారిలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాల్లో హై డ్రామా చోటు చేసుకుంది. రాజీనామాలు చేసిన జనతాదళ్, కాంగ్రెస్ లోని 14 మంది ఎంఎల్ఏల్లో కొంతమంది ముంబాయ్ లోని ఓ హోటల్లో క్యాంపు వేసిన విషయం తెలిసిందే.

 

వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ లోని సీనియర్ నేత, మంత్రి డికె శివకుమార్ ముంబాయ్ వెళ్ళారు. అయితే అక్కడ ఆయనకు ఊహించని షాక్ ఎదురైంది. ఎంఎల్ఏలు బస చేసున్న హోటల్లోకి వెళ్ళిన  శివకుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఎంఎల్ఏలను తాను కలవటాన్ని పోలీసులు అడ్డుకోవటం ఏమిటో శివకుమార్ కు అర్ధం కాలేదు.

 

శివకుమార్ ఎంత వాదించినా పోలీసులు పట్టించుకోలేదు. విషయం ఏమిటంటే ఎంఎల్ఏల రాజీనామాల వెనుక బిజెపి ప్రోద్బలం ఉందన్నది వాస్తవం. అందుకే ఎంఎల్ఏలతో ముంబాయ్ లో క్యాంపు పెట్టించింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది బిజెపినే కాబట్టి  ప్రస్తుతానికి రెబల్ ఎంఎల్ఏల రక్షణకు వచ్చిన ఢోకా అయితే లేదు. ముంబాయ్ లో ఉన్నంత కాలం వాళ్ళని కాంగ్రెస్, జనతాదళ్ పార్టీ నేతలెవరూ కలవలేరు.

 

అందుకే వాళ్ళని బయటకు రప్పించే పని మొదలైంది. ఇందులో భాగంగానే వాళ్ళ రాజీనామాలను స్పీకర్ తిరస్కరించారు. వ్యక్తిగతంగా తన ముందు హాజరై మాట్లాడితేనే తాను రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పేశారు. అంటే రెబల్ ఎంఎల్ఏలు ముంబాయ్ నుండి బెంగుళూరుకు చేరుకోవటం తప్ప వేరే దారిలోదు. వాళ్ళు గనుక కర్నాటకలో ఎక్కడున్నా బిజెపి రక్షించలేందు. మొత్తానికి కర్నాటక రాజకీయం నిముషానికో మలుపు తిరుగుతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: