ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయించారు. 2014-19 మధ్య ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతుకు పరిహారం ఇవ్వాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. దాంతో కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు కాస్తయినా ఊరట లభించే అవకాశం ఉంది.

 

విషయం ఏమిటంటే గడచిన ఐదేళ్ళల్లో రాష్ట్రంలో 1531 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే రైతుల కోసమే అంటూ ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టిన చంద్రబాబునాయుడు పరిహారం కూడా అందరికీ అందించలేదు. జగన్ చెప్పిన లెక్కల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో కేవలం 391 మంది కుటుంబాలకు మాత్రమే పరిహారం అందిందట.

 

అదే విషయాన్ని రైతు ఆత్మహత్యలపై జరిగిన సమీక్షలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ పరిహారం అందని రైతు కుటంబాల దగ్గరకు కలెక్టర్లు వెళ్ళి పరిహారం అందించాలని ఆదేశించారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 7 లక్షలు అందించాలని ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారింది.

 

పరిహారం అందించేటపుడు కలెక్టర్లు స్ధానిక ఎంఎల్ఏలను దగ్గర పెట్టుకుని మరీ వెళ్ళాలన్న జగన్ ఆదేశాలు కూడా పార్టీ బలోపేతానికి దోహదపడేదనటంలో సందేహం లేదు. ప్రభుత్వం తరపున లబ్దిదారులకు కానీ లేకపోతే బాధిత కుటుంబాలకు అందే ప్రతీ లబ్ది లేదా పరిహారం తమ ప్రభుత్వమే అందిస్తోందన్న విషయం అందరికీ తెలిసేందుకే ఎంఎల్ఏలు ఉండాలని జగన్ చెప్పారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: