ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి రాజకీయాలలోకి రానున్న మహిళా. చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ భార్య, నందమూరి బాలకృష్ణ కూతరు నారా బ్రహ్మీని రాజకీయాలలోకి రానున్నారట. నారా బ్రహ్మీని ఎంత చెక్కగా స్పీచ్ ఇస్తారు అనేది అందరికి తెలుసు, నారా లోకేష్ లాగా ఎప్పుడు నోరు జారారు, అనుకువగా, సమయం, సందర్భం చూసుకొని మాట్లాడుతారు. 


అయితే నారా బ్రహ్మీని పేరు ప్రస్తుతం ఎక్కడ, ఏ న్యూస్ ఛానళ్లలో, ఆన్లైన్ వెబ్ సైట్ లో వినిపించడం లేదు కానీ సోషల్ మీడియా వేధికగా నారా బ్రహ్మీని పేరు వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంత తక్కువ మెజారిటీతో ఓడిపోయిన తెలుగు దేశం పార్టీ ఉంటుందా ఉండదా అనే ప్రశ్న టీడీపీ ఎంపీల నుంచి కార్యకర్త వరుకు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ప్రశ్నకు మరింత ప్రాణం పోస్తున్నాడు నారా లోకేష్. నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా చేసే కొన్ని ప్రశ్నల్లో అర్ధాలు లేక నెటిజన్ల చేత అవమానాల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు దేశం పార్టీ మళ్ళీ నిలబడటానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసారట. 


నారా లోకేష్ బదులు 'నారా బ్రహ్మీని'ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిలబెట్టి నెక్స్ట్ ఆంధ్ర సీఎం నారా బ్రహ్మీనిని చెయ్యాలనుకుంటాన్నారని తెలుగు దేశం పార్టీ అభిమానులు ట్విట్టర్ వేధికగా నారా లోకేష్ పెట్టె పోస్టులకు కామెంట్ చేస్తున్నారు. నారా కుటుంబం నుంచి మళ్ళీ సీఎంగా అవ్వాలంటే ఒక్క నారా బ్రహ్మీని ఏ అవ్వగలరని గతంలో కొంతమంది విశ్లేషకులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అని పోస్ట్ చేసిన నెటిజన్లు ఇప్పుడు నార బ్రహ్మీని సీఎం అని అంటున్నారు. ఒక వేళ నార బ్రహ్మీని సీఎం అయితే ఆంధ్ర ప్రదేశ్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి నారా బ్రహ్మీని అవుతారు. నెటిజన్లు అనుకున్నట్టు ఇది నిజం అవుతుందా లేదా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: