చంద్రబాబుది మాస్టర్ మైండ్. వూరికే ఏదీ చేయరు. నిజానికి ఆయనకు డెబ్బయ్యేళ్ళ వయసు. ఓటమి ఎదురైంది, హుందాగా స్వీకరించి కొన్నాళ్ళు జగన్ సర్కార్ పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి. జనానికి జగన్ అంటే ఎంత మోజు ఉందో ఆయనకు వచ్చిన సీట్ల వరదను చూస్తే అర్ధమవుతుంది.


కానీ బాబు మాత్రం వూరికే ఉండేందుకు ఇష్టపడడంలేదు. మొదటి రోజు నుంచి కూడా జగన్ పాలన మీద విరుచుకుపడుతున్నారు. ఓదార్పు యాత్రలు జగన్ చేస్తే పరామర్శ యాత్రలు అని పేరు కూడా  కాపీ కొట్టి మరీ కార్యకర్తల ఇళ్ళకు వెళ్తున్నారు. వారి చేతిలో కొంత సొమ్ము ఉంచి ఆదుకుంటానంటూ  భరోసా ఇస్తున్నారు.


బాగానే ఉంది కానీ జగన్ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందని బాబు ఇలా రోడ్డున పడుతున్నారన్నది పెద్ద ప్రశ్న. ఇక బాబు ఇలా చేయడానికి మరో కారణం ఉందంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలను తాను తీసుకోను అని జగన్ అన్నాడు కానీ పార్టీ నేతలను తీసుకోను అనలేదు. దాంతో ప్రతి నియోజకవర్గంలో సీనియర్ నేతలు, ద్వితీయ స్థాయి నేతలకు వైసీపీ ఎర వేస్తోంది. 


వారినే టార్గెట్ గా పెట్టుకుంది. వారంతా చేరితే ఎమ్మెల్యేలు పక్కన  ఉన్నా పార్టీ పోయినట్లే. జగన్ తెలివిగా కదుపుతున్న ఏ పావులు బాబు గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నాయట. దీంతో ఆయన ఆదరాబాదరాగా యాత్రల ప్రొగ్రాం స్టార్ట్ చేశారట. అవన్నీ అలా ఉన్నా అధికారంలో ఉన్నపుడు క్యాడర్ ని బాబు పట్టించుకోలేదు. ఇపుడు వారిని పార్టీలో ఉండమని బతిమాలినా ఉంటారా. మంచి ఆఫర్ చూసుకుని వైసీపీలోకి వెళ్ళే వారు వెళ్ళిపోతూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: