ఏపీలో పాలనాపరంగా దూకుడుగా వెళుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అదిరిపోయే షాక్ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ‌రావ‌తికి నిధులు ఇవ్వాలంటే తాము త‌నిఖీలు చేయాల‌ని చెప్పింది. ఇదే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ నుంచి సమాచారం అందింది. 


అమ‌రావ‌తి నిర్మాణానికి బ్యాంక్ త‌నిఖీల ప్యానెల్ వ‌చ్చి త‌నిఖీలు చేస్తుంద‌ని... దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఏ విష‌యం అయినా ఈ నెల 23వ తేదీలోగా తేల్చిచెప్పాల‌ని చెప్పింది. ఈ విష‌యంపై ప్ర‌పంచ‌బ్యాంక్‌ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అమ‌రావ‌తి నిర్మాణానికి రూ. 7200 కోట్ల రుణం ఇవ్వాల‌ని ప్ర‌పంచ‌బ్యాంక్‌ను కోరింది. కేంద్ర‌ప్ర‌భుత్వం కూడా దీనికి ఓకే చెప్పింది. 


అయితే రాజ‌ధానికి చెందిన కొంద‌రు దీనిపై 2017లో ప్ర‌పంచ‌బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. త‌మ విస్తృత ప్ర‌యోజ‌నాల‌కు అమ‌రావ‌తి ఇబ్బంది క‌లిగిస్తోంద‌ని వారు తెలిపారు. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తికి రుణాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని కూడా కోరారు. ఈ సమయంలోనే ప్రపంచబ్యాంక్ తనిఖీలకు సిద్ధమైంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు రాజ‌ధానిలో జ‌రిగిన అక్ర‌మాల‌పై సైలెంట్‌గా ఉన్న ప్ర‌పంచ‌బ్యాంకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రపంచబ్యాంక్ మోకాలడ్డడం సంచలనంగా మారింది. 


ఇక జ‌గ‌న్ వ‌స్తే రాజ‌ధానికి బ్రేక్ ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తోన్న ప్ర‌చారానికి ఇప్పుడు ప్ర‌పంచ‌బ్యాంకు చ‌ర్య‌లు మ‌రింత ఊత‌మిచ్చేలా ఉన్నాయి. ఈ సంక్టిష్ట ప‌రిస్థితుల నుంచి జ‌గ‌న్ ఎలా బ‌య‌ట ప‌డ‌తాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: