ఏపిలో ప్రస్తుతం వైసీపీ పాలన కొనసాగుతుంది.  ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తన పాలన విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం లో జరిగిన లోటు పాట్లు తన పాలనలో ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అధికారులకు, మంత్రి వర్గాని తెలిపారు.  మరోవైపు జగన్ మంత్రి వర్గం కూడా దూకుడు పెంచింది..నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నా అక్కడ సీరియస్ వర్క్ ఔట్ చేస్తున్నారు.  తాజాగా  ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పాలన కాలం ఒక బేడ్ పీరియడ్ అంటూ అభివర్ణించారు.  గత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో అన్నీ కల్పిత కథలే చెబుతూ పబ్బం గడిపిందని..కానీ అది వాస్తవ పరిస్థితులో ఎక్కడా కనిపించడం లేదన్నారు. అంకెలు తప్ప వాస్తవ పరిస్థితుల్లో ఆ అభివృద్ధి కనిపించలేదన్నారు.  గత తెలుగు దేశ ప్రభుత్వం రైతులకు మేలు చేసిందని..వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిందని గొప్పలు చెప్పారు..కానీ వ్యవసాయ రంగం అభివృద్ధిని పరిశీలిస్తే అన్నీ మైనస్ స్థానంలో ఉన్నాయన్నారు.   

అయితే చేపలు, గొర్రెలు పెంపకం ఉత్పత్తి పెంచడాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ రంగం 33 శాతం పెరిగిందని చూపించారని అది సరికాదన్నారు. చేపల ఉత్పత్తి పెంపకం పెరిగినంత మాత్రాన గ్రోత్ రేట్ అనేది వ్యవసాయ రంగంలో ఉంటుందా అని నిలదీశారు. 2004 నుంచి 2009 వైఎస్ పాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు. ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి చంద్రబాబు పాలనలోకి వచ్చింది రాష్ట్రం గడ్డ పరిస్థితి ఎదుర్కొందని ఆయన అన్నారు. పరిమితికి మించి అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: