జగన్ తానూ సీఎం అయిన నుంచి చెబుతూనే ఉన్నాడు. తాను ఎట్టి పరిస్థితిలో అవినీతిని సహించనని దానికి తగ్గట్టుగానే తన మంత్రివర్గానికి ముందుగానే గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే అయితే కొందరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. జగన్ అంతగా చెబుతున్నా కొంతమంది అవినీతి వ్యవహారాలను చేస్తున్నట్టుగా జగన్ కు పక్కగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. అందుకే వారిపై చర్యలు తీసుకోవడానికి సీఎం ఫిక్సయినట్టుగా వార్తలు వస్తున్నాయి.


ఆ జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉందని సమాచారం. ఆమెకు మంత్రి పదవి దక్కడమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. శాఖ వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం ఎక్కువగా ఉండటంతో ఆమెపై చర్యలు ఉండవచ్చని టాక్.ఇక తన సొంత జిల్లాకు అంతా తనే పెద్ద అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఒక సీనియర్ మంత్రిపై కూడా జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇక ఒక ధర్మబద్ధమైన శాఖకు మంత్రిగా  ఉంటూ..రెండు కోట్ల రూపాయల లంచం వ్యవహారంలో చేతులు చాచాడట ఒక మంత్రి.


ఆయనపై కూడా చర్యలు తప్పవని  వార్తలు వస్తున్నాయి. ఇక  ఒక విద్యాలయం సీజ్ ఓపెనింగ్ కు సంబంధించి ఒక మంత్రిపై చర్యలు తప్పవని టాక్. అలాగే తన శాఖలో అప్పుడే ఒక కాంట్రాక్టుకు సంబంధించి అవినీతి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై కూడా జగన్ చర్యలకు సిద్ధం చేస్తున్నట్టుగా వినికిడి.ఇలా పాతిక మందిలో అప్పుడే ఐదు మందికి ఫైనల్ వార్నింగ్ప్ పూర్తి అయ్యాయని.. వారిపై చర్యలకు జగన్ సిద్ధం అవుతూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది! 

మరింత సమాచారం తెలుసుకోండి: