చెప్పుకోవడానికి సముద్రం పక్కనే ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేక విలవిలలాడుతుంది చెన్నై పట్టణం.కేవలం అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అమాయకపు చర్యల వల్లే చెన్నై నగరానికి ఈ పరిస్థితి వచ్చింది. అడ్డదిడ్డమైన కట్టడాలను కట్టి జలవనరులకు రిజర్వాయర్లు లేకుండా చేశారు, చెరువులను కబ్జా చేసి,నగరాన్ని మొత్తం కాంక్రిట్ మాయం చేశారు. అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.

నీటి వనరులను కాపాడుకోకపోతే హైదరాబాద్ మహనగరానికి కూడా చెన్నైకి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఇంకుడు గుంతల ఏర్పాట్లు,చెరువుల తవ్వకాలు జరిపించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.అయితే ఇలాంటి పరిస్థితి ఎప్పటికి అమరావతికి రాదని, అమరావతి నిర్మాణం పక్కా ప్రణాళిక బద్దంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.

కానీ ఆంద్రప్రదేశ్ కి కూడా ఆ ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు, ముఖ్యంగా విశాఖపట్నం కు త్వరలోనే నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. విశాఖలో ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు జరుగుతున్నాయి, వేల సంఖ్యలో నగరవాసులు బోర్లు వేయడంతో మంచినీటి లోనికి సముద్ర జలాల కలుస్తున్నాయి. తీరంలోని చాలా బోర్  లలో ఉప్పు ఉడుకుతుండగా.. మేల్కొనకపోతే చెన్నై మహానగరానికి పట్టిన పరిస్థితే విశాఖ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 300 అడుగుల పైగా బోరు వేసిన త్రాగునీరు పడకపోవడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుందని,అధికారులు ఇప్పటికైనా విశాఖ నగరం పై శ్రద్ధ పెట్టాలని కోరుతుకుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: