టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీని ఉపయోగించి చేసే మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ ను ఉపయోగించి మనం ప్రపంచాన్ని  చూస్తున్నావు అనుకుంటున్నాను కానీ అదే ఇంటర్నెట్ ను ఉపయోగించి ప్రపంచం మనల్ని కూడా చూస్తుందని మనం గుర్తించాలి, మన ఇంట్లో ఉన్న చిన్న కెమెరా చాలు మన రహస్యాలని బయట పెట్టడానికి,ఒక్క చిన్న క్లిక్ చాలు వాటిని ప్రపంచం ముంగిట పెట్టడానికి  అందుకే టెక్నాలజీని ఉపయోగించి ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి అంటున్నారు నిపుణులు.
 
గుజరాత్ లో ఒక వ్యాపారి కెమెరా కలిగిన ఒక స్మార్ట్ టీవీ కొనుగోలు చేశారు, దాన్ని తన బెడ్ రూమ్ లో ఏర్పాటు చేసుకొని దానికిఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చాడు, అంతా మామూలుగానే సాగుతుంది అనుకున్నాడు కానీ ఓరోజు పోర్న్ సైట్ లో తన భార్యతో కలిసి గడిపిన శృంగార వీడియో చూసి కంగుతిన్నాడుఆ వ్యక్తి.ఇల్లంతా గాలించిన కెమెరా ఎక్కడుందో కనపడలేదు అతనికి  వెంటనే ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఎంక్వయిరీ చేపట్టిన పోలీసులు ఆన్ లో ఉన్న టీవీ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం మూలంగా ఆ కెమెరాని ఎవరో హ్యాకర్ హ్యాక్ చేసి వీడియో రికార్డ్ చేశారు అని నిర్ధారించారు.
 
స్మార్ట్ టీవీ, స్మార్ట్ మొబైల్స్ ని వాడే విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ వస్తువులు కూడా  నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: