పుల్వామా దాడి తర్వాత సరిగ్గా 12 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసి తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ప్రపంచ దేశాలకు భారత్ ధైర్యాన్ని, పాకిస్థాన్ కు భారత్ బలాన్ని చూపించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్టు పాకిస్థాన్ మీద ప్రపంచ అగ్రరాజ్యాలు విరుచుకు పడ్డాయి. నిజాన్ని మింగలేక కక్కలేక తేలు కుట్టిన దొంగల మౌనంగా ఉండిపోయింది పాకిస్థాన్.

పాకిస్థాన్ వక్రబుద్దిని పసిగట్టిన భారత్ ఎప్పటికప్పుడు పాక్ ను ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. తీవ్రవాదాన్ని అణిచివేయాలని చూస్తున్న ప్రతిదేశం కన్ను ఇప్పుడు పాకిస్థాన్ పైనే ఉంది అది గమనించిన పాకిస్థాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్ పై ముప్పేట ఒత్తిడి జరిగింది. మరోసారి ఎయిర్ స్ట్రైక్ జరుగుతుందని భావించిన పాకిస్తాన్ తమ  తమ ఉగ్రవాద సంస్థలు జైష్ ఈ మహమ్మద్,లష్కర్ ఈ తోయిబా స్థావరాలను భారత్ సరిహద్దుల నుండి ఆఫ్గానిస్తాన్ సరిహద్దులు మార్చినట్టు సమాచారం.

ఈ రెండు ఉగ్రవాద సంస్థలు భారత్ కు వ్యతిరేకంగా టెర్రరిస్టులను తయారు చేయడం కోసం పాక్ ఇలా చేస్తుందని సమాచారం.ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ ప్రభుత్వం ప్రకటించిన అవన్నీ అబద్దాలని నమ్మిన ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ సంస్థ పాక్ కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: