2014 ఎన్నికల ముందు బీజేపీ నాయకులు ఆంధ్రులకు చెప్పిన మాట "ప్రత్యేక హోదా".రాజకీయ నాయకులు స్వలాభాలు చూసుకున్నారు కానీ రాష్ట్రం అభివృద్ధిని పక్కన పెట్టారు గత ప్రభుత్వం పెద్దలు. రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ పెద్దలు ఇప్పటికి కూడా ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పెదవి విప్పడం లేదు. కనీసం విభజన చట్టంలో ఉన్న సదుపాయాలు కూడా రాష్ట్రానికి కల్పించడం లేదు.

మొన్న ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా ఆంద్రప్రదేశ్ ఊసే లేదు,ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర రాజకీయ పెద్దలు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు అనేది సగటు ఆంద్రుడి ఆవేదన,అయితే లోక్ సభలో కేంద్ర బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన కేంద్రం ఏపీ కి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక సహాయం చేస్తాం అని అందుకు మేము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు తోనే హోదా అంశం మరుగున పడిపోయింది అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: